ఓం శ్రీ వినాయకాయనమః

Wednesday, September 22, 2010

నిమజ్జనం

జైజై.. బైబై .. గణనాథా
  గణపతి బొప్పా మోరియా... ఆదాలడ్డూ చోరియా... జై భోలో గణేశ్‌ మహరాజ్‌కు జై... జైజై గణనాథా... బైబై గణనాథా అంటూ గడచిన పదకొండు రోజులుగా భక్తుల విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్య ఎట్టకేలకు వినాయకసాగర్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనమయ్యారు. రాష్ట్ర రాజధానినగరంతో పాటు వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నుంచి గణనాథులు ఆయా ప్రాంతాల్లో నిమజ్జనానికి తరలివెళ్ళారు. అక్కడక్కడ చిన్నపాటి అపశ్రుతులు దొర్లినా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు లేకుండా భక్తి పార వశ్యంతో... శాంతియుత వాతావరణంలో సామూ హిక వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. గత యేడాది పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచే వినాయకులను తరలించేవారు. అయితే పోలీసులు వ్యూహాత్మక బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, వినాయకులను మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతనే ఆయా మండపాల నుంచి తరలించారు. దీనివల్ల గురువారం సాయంత్రం వరకు నిమజ్జన కార్య క్రమాలు జరగనున్నాయి. బుధవారం ఉద యం 12 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య, హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మరో మంత్రి దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
charminar-ganesha
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ సంయమనంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవడంతో పాటు ఈ నెల 24న అలహాబాద్‌ కోర్టు తీర్పు నేపథ్యంలో అన్ని వర్గాలు శాంతికోసం ప్రయత్నించాలని సూచించారు. చార్మినార్‌ వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌, బండారు దత్తాత్రే య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు వినాయక మండపాలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మజ్లిస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి ముస్లింలు సైతం వినాయక విగ్రహాలకు స్వాగతం పలకడం చార్మినార్‌ సాక్షిగా మతసామరస్యాన్ని చాటింది. ప్రతి సంవత్సరం వలె భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి చార్మినార్‌ వద్ద భారీ వేదికను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.

విఘ్నాలు తొలగిపోవాలి : హోంమంత్రి
భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన ఎంజేమార్కెట్‌, చార్మినార్‌ ప్రాంతాల వేదిక నుంచి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లా డుతూ రాష్ట్రంలో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గత యేడాది రాష్ట్రంల ఓ చాలా విఘ్నాలు చోటు చేసుకున్నా యని, ఈ సంవత్సరం అలాంటివి లేకుండా చూడాలని గణాధీశుడిని వేడుకున్నారు.

గణపతిని పూజించాలి : దానం నాగేందర్‌
రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌ మాట్లాడుతూ హిందువులు గణపతిని ఆదిదేవుడిగా కొలుస్తారని, ముందుగా విఘ్నాధిపతిని పూజించడం వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ప్రసంగించారు.

ప్రజలు సోదరభావంతో మెలగాలి: కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ
చార్మినార్‌ భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితీ ఏ ర్పాటు చేసిన వేదిక వద్ద నుంచి కిషన్‌రెడ్డి, దత్తా త్రేయ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రజలు భక్తి ప్రవత్తులు, శాంతి సామరస్యా లతో జరుపుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతా ల్లో భక్తులకు ఇబ్బందులు కలిగే విధంగా పోలీసు లు అతిగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నెల 24న అయోధ్య- బాబ్రీ మసీదు విధ్వంసం కేసు తీర్పును అందరూ సమానంగా తీసుకుని శాంతికి మార్గం చూపాలని వారు ఆకాంక్షించారు.

అక్కడక్కడ అపశ్రుతులు
అంగరంగ వైభవంగా, భక్తుల ఆనందోత్సాహాల మధ్య రాజధానితో పాటు శివారు, రంగారెడ్డి జిల్లా లో జరిగిన సామూహిక వినాయక నిమజ్జన కార్య క్రమంలో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నా యి. అయితే చిన్నపాటి సంఘటనలే కావడంతో భక్తులు సైతం పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు. మొజాజంజాహి మార్కెట్‌ వద్ద ఊరేగింపుగా వస్తున్న పహిల్వాన్‌ వినాయక విగ్రహం కుప్పకూల డంతో ఇద్దరు గాయపడ్డారు. అనంతరం పోలీసు లు, సహాయక సిబ్బంది సహకారంతో ఊరేగింపు కు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగింది. వినాయకనిమజ్జనోత్సవంలో ఉత్సాహం గా పాల్గొంటూ వచ్చిన చిన్నారిని ట్రాలీ ఢీ కొనడం తో తీవ్ర గాయలకు గురైంది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పాతబస్తీలోని పూల్‌ బాగ్‌లో తీగలు తెగి ఆందోళన కలిగించింది.

సాయంకాలం వర్షం.. అయినా తగ్గని భక్తజనం
ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచండ భానుడి ప్రతాపాన్ని చూపిన వాతావరణం సాయం త్రం ఒక్కసారిగా చల్లగాలులను వీచింది. నగరం, శివారు, రంగారెడ్డి జిల్లాలో భారీస్థాయిలో వర్షం పడటంతో ఒక్కసారిగా భక్తులు చెల్లాచెదుర య్యారు. పోలీసులు వర్షం కారణంగా వినాయక విగ్రహాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున మం డపాల నిర్వాహకులకు ఆయా విగ్రహాలపై తడవ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మొరాయించిన క్రేన్లు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సహకారంతో అట్ట హాసంగా భారీ స్థాయిలో 85 క్రేన్లను వినాయక సాగర్‌ చుట్టూ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, బుధవారం ఉదయం కొన్ని గణపతులు వస్తున్న వేళ నాలుగు క్రేన్‌లు మొరాయించాయి. మధ్యా హ్నం తర్వాత మెకానిక్‌లు వాటిని బాగుచేశారు.

వెల్లివిరిసిన మతసామరస్యం
ఇటీవలే మతఘర్షణలతో అట్టుడికిన పాత నగరంలో సైతం ముస్లింలు వేదికను ఏర్పాటు చేసి వినాయక మండపాలకు స్వాగతం పలకడం పాత బస్తీ ప్రజల మతసామరస్యం... పరిణతి కనిపిం చింది. ఇటీవలే రంజాన్‌ - గణపతి చవితి ఈ రెం డు పర్వదినాలు ఒకే రోజు వచ్చాయి. ఆ రోజు చిన్నపాటి సంఘటన జరగకపోవడం... మరో రెండు రోజుల్లో బాబ్రీ విధ్వంసంపై కోర్టు తీర్పు మ రో 48 గంటల్లో వెలువరించనున్న నేపథ్యంలో సామూహిక వినాయక నిమజ్జనం కార్యక్రమం జరి గినా ముస్లింలు సైతం వినాయకులకు స్వాగతం పలకడం ప్రజల్లో పరిణతి ప్రస్పుటమైంది.

హబ్సీగూడ లడ్డూ ధర రూ.5.65 లక్షలు
అనాదిగా నగర శివారులోని బాలాపూర్‌ వినా యకుడి లడ్డూ వేలంపాట ఎక్కువగా సాగుతుం డేది. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ తర్వాత చాలా ప్రాంతా లకు ఈ లడ్డూల వేలం విస్తరించింది. ఈ క్రమం లో ఈయేడాది బడంగ్‌పేటలో గణేష్‌ లడ్డూను రూ. 5.65 లక్షలకు హబ్సీగూడ కు చెందిన సుమన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎంతో పేరొంది న బాలాపూర్‌ లడ్డూను 5.35 లక్షలకు మియాపూ ర్‌ ప్రాంత వాసి కొడాలి శ్రీధర్‌ వేలంలో దక్కించు కున్నారు. బాలాపూర్‌ లడ్డూ వ్యవహారంలో సరిత అనే మహిళ ఎక్కువగా వేలంపాటలో పాటపాడినా తనకు దక్కలేదని ఆమె ఆరోపించారు. కాగా గత ఏడాది ఇదే లడ్డూ రూ.5.10లక్షలు పలకగా ఈ సారి అదనంగా 25వేలు పెరగడం విశేషం. సైదా బాద్‌ వినాయక్‌ నగర్‌ రూ. 5.61 లక్షలకు, వినయ్‌నగర్‌ రూ. 2.61, రాంనగర్‌లో రూ. 2. 80 లక్షలకు ఉప్పల్‌కు చెందిన శాంతిబాబు దక్కిం చుకున్నారు. ఇక కూకట్‌పల్లిలో రూ. 2.53 లక్షల కు గొట్టిముక్కల రామారావు, మూసాపేటలో 51 వేలకు యాదగిరి, హస్తినాపురంలో రూ. 83 వేలకు దుబ్లానాయక్‌, వస్థలిపురంలో రూ. 35 వేలకు ముద్దగోని శేఖర్‌ గౌడ్‌లు దక్కించుకున్నారు.

Tuesday, September 21, 2010