పురాతన శాస్త్రవేత్తలు వినాయకుడిని విశ్వవ్యాపి అని నిర్ధారించారు. ఇండియా, బర్మా, థాయ్‌లాండ్, కాంబోడియా, పర్షియా, నేపాల్, టిబెట్, చైనా, టర్కిస్తాన్, మంగొలియా, జపాన్, బల్గేరియా, మెక్సికో, పెరూలలో గణేషుడు ఆరాధనలను అందుకుంటున్నాడు. బౌద్ధులు కూడా ఆరాధిస్తారనేది, ‘గణపతి హృదయమ్’ మంత్రం ద్వారా తెలుస్తుంది. ఈ మంత్రాన్ని స్వయంగా బుద్ధుడే ఆనందుడనే భక్తునికి ఉపదేశించాడట. జైనులు తమ వృత్తి ఆరంభంలో వినాయకుడి పూజలు చేస్తారు. స్పినోజా అనే పాశ్చాత్య వేదాంతుడు వినాయకునికి ప్రకృతిని అన్వయించడానికి మూల ప్రకృతే ప్రాణం. ప్రాణంలో జీవశక్తి ఉంటుంది. మాక్స్ ప్లాంక్ భౌతిక శాస్త్రంలోని క్వాంటమ్ సిద్ధాంతానికి ప్రాణశక్తికి ముడిపెట్టాడు.
జపాన్‌లో ఉమాసుతుడు...
9వ శతాబ్దం నాటికే జపాన్‌లో వినాయకుడి పూజ స్థిరపడివుంది. బౌద్ధముని కోబో డైషీ జపానులో వినాయకుడి ప్రార్థనను ప్రవేశపెట్టాడని అంటారు. వజ్రధాతు గణేశుడిగా బౌద్ధ దేవతగా అవతరించాడు. జపాన్ వినాయకుడు త్రిముఖుడు, త్రినేత్రుడు. కాంగిటెన్ శాఖ బౌద్ధంలో ప్రజాదరణ సముపార్జించుకున్న దేవుడయ్యాడు. జపాన్‌లో వినాయకుడు పురుషుడిగా, స్ర్ర్తీరూపంలో కూడా దర్శనమిస్తాడు. బౌద్ధానికి హైందవానికి తేడా ఏమిటంటే బౌద్ధులు దేవుళ్ళకు అంత ప్రాముఖ్యం ఇవ్వరు. బౌద్ధులకు మోక్షమార్గమే ప్రధానం. హిందువులు దేవుళ్ళను పూజలతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
టిబెట్ గణనాథుడు...
టిబెట్‌కు చెందిన తాంత్రి కవాద బౌద్ధులు వినాయకుడికి సంబంధించిన మంత్రతంత్రాల ను టిబెటన్ భాషలోకి అనువదించారు. వినాయకుడిని టిబెట్‌లోని ఖోతాన్, ఎండే రే, కష్గర్, లొబ్నొర్‌లో పూజించేవారు. టిబెటుల ప్రకారం గణేశ్, గణేశిని కూడా వున్నారు.గ్రీకు వినాయకుడు...
లాటిన్ పదం జానస్ నుంచి జనవరి వచ్చింది. జానస్ రోమ్‌లో ప్రారంభాని కి అధిపతి, దేవత. తలుపులకు, ద్వారా లకు కూడా జానస్ అధిష్ఠాన దేవుడు. మార్పుకు కూడా దేవుడిగా పరిగణిస్తారు. ఈ దేవుడే డబ్బు, చట్టాలు, వ్యవసాయాన్ని తీసుకువచ్చినట్లు గ్రీకుల విశ్వాసం. రోమ్‌లో గణపతి రోమ్ రక్షకుడు.
వియత్నాం విఘ్నాధిపతి...
ఇది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చామ్ రాతి వినాయక విగ్రహం. ఇది దనాంగ్ మ్యూజియం లో ఉంది. ఈ విగ్రహం మానవశరీరం, ఏనుగుతలతో నిలబడి వున్న వినాయకుడి రూపకల్పన. వినాయకుడి కాళ్ళకు పాదరక్షలు లేకపోవడం గమనార్హం. గణేశుని ఎడమచేతిలో పాత్రవుంది.
బౌద్ధ గణపతి
ఈ కంచు విగ్రహంలో వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులను సూచించడం మనం గమనించవచ్చు, బౌద్ధంలో మన తరహా కంటే తంత్రశాస్తప్రరమైన గణపతే ప్రతీతి. బౌద్ధంలో ఏనుగులు పవిత్రమైనవని, బుద్ధుడి ఆవిర్భావానికి వేగుచుక్క అని భావిస్తారు.థాయ్ గణపతి...
థాయ్‌లాండ్‌లో వినాయకుడిని ‘‘ప్రపికనేత్’’గా పూజిస్తారు. అదృష్టదేవతగా, విఘ్నాలను తొలగించేవాడిగా అర్చిస్తారు. థాయ్‌లాండ్ వినాయకుడికి కళలు, చదువు, వాణిజ్యంతో సన్నిహిత బాంధవ్యం వుంది. 6-8వ శతాబ్దాల కాలంనుంచి థాయ్‌లాండ్‌లో గణపతి అక్కడి ప్రజల పూజలందుకుంటున్నాడు. థాయలాండ్ లలితకళల మంత్రిత్వ శాఖ గుర్తు పై వినాయకుడు దర్శనమిస్తాడు. థాయ్‌లాండ్ అంతటా ఫ్రా పికనెత్ దేవస్థానాలు వెలిశాయి. రాజధాని బాంకాక్‌లో రాజకుటుంబీకులైన బ్రాహ్మణ మందిరం వీటిల్లోకల్లా శ్రేష్టమైందిగా పరిగణిస్తారు.కాంబోడియా విఘ్నేశ్వరుడు...
కాంబోడియాలో నివసించే ఒక జాతివారిని ఖేమేర్‌గా పేర్కొంటారు. ఇదే ఆదేశం అధికార భాష పేరుకూడా. ఈ భాష పై మన వేదభాష సంస్కృతం ప్రభావం ఎంతగానో వుంది.నేపాల్ గజాననుడు...
విఘంతక లేక విఘ్నేశ నేపాల్ లో, పశ్చిమ టిబెట్‌లో దర్శన మిస్తాడు. ఉత్తరదిశను రాజ్య మేలే విఘంతక నేపాలీ దేవుళ్ళ సముదాయంలో కోపిష్టిగా ప్రసిద్ధుడు. విఘ్నాలను హరించేవాడిగా ఆయన్ను ఆవాహన చేస్తారు.
ఆగ్నేయాసియాలో ప్రత్యేకించి ఇండోనేషియాలో గణపతికి ప్రజాదరణ పతాక స్థాయిలో ఉంది.మజాపహిత్ రాజుల కాలంలో (కీ.శ.1294- 1478) తూర్పు జావా శక్తిసంపదలు వెల్లివిరిసాయి. ఎంతో స్వేచ్ఛతో ఊహాశక్తితో ఈ ప్రాంతంలో గణేశుని రూపకల్పన చేశారు.
ఇండోనేషియా (1867) తూర్పు జావాలోని బోరో వినాయకుడి పార్శ్వ దృశ్యం
కాంబోడియాకు చెందిన అరుదైన గణపతి కాంస్య విగ్రహం ఇది.