భారత దేశం సర్వ సంపదలకు నిలయం. సకల ఆయుర్వేద ఔష ధాలకు నిలయం. మన సంస్కృతీ సంప్రదాయాలలో ఆరోగ్య రహ్యస్యాలు ఇమిడి ఉన్నాయి. నాడు పండుగలు భక్తి భావనతో చేసేవారు. వాటి ఆంతర్యాలు, ఆరోగ్య సూత్రాలు అనుభవపూర్వకంగా తెలుసుకుని తెలియజేసేవారు. ఈ నేపథ్యంలో మన పండుగలలో వినాయక చవితికి చాలా గొప్ప విశిష్టత ఉంది. ఆనాడు వనమూలికల తో గణనాథులను తయారుచేసేవారు. వీటిని నీటిలో నిమజ్జనం చేస్తే పర్యావరణానికి మేలు జరిగేది. ఈ విధంగా స్కూటర్ మెకానిక్ తిరుమ లశెట్టి చంద్రశేఖర్ వనమూలికలతో గణనాథుడిని ప్రతిఏటా ప్రతిష్ఠిస్తూ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తుండడం విశేషం.
వినాయక చవితి పర్వదినం నిజంగా మనకు మహా గొప్ప వరం. ఈ పం డుగలో ముఖ్యంగా మట్టి ప్రతిమను మహత్తర మూలికలతో తయారు చేసి ఈ పండుగ చేసేవారు ఆనాడు. అందుకే వినాయక చవితి వస్తోంది అంటే అందరికీ ఆయుర్వేద ఆరోగ్యం అందుబాటులోకి వస్తోందని అను కునేవారు. ఇక మనకు తెలియని ఎన్నో ఔషధాలు ప్రకృతి ద్వారా లభి స్తున్నాయి. మహామూలి కలను ప్రకృతి అందిస్తోంది. ఈ వినాయక చవి తిద్వారా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆనాటి రుషులు ఆకాక్షించారు. ప్రతి ఒక్కరు మూలికలతో వినాయకుడి ని పూజించమని తెలియజేశారు. మూలికలను తెలుసుకునే ప్రయత్నమే ఈ చవితి. కనీసం 21 రకాల ఆకులు కాని, లేదా పండ్లు కాని... అందరికీ అందుబాటులో ఉన్న ఔషధాలను గుర్తించి వ్యాధులకు గురికా కుండా ఈ చవితినాడు ఆ గణపతిని నవరాత్రులు పూజించమని మనకు తెలియజేశారు.
వనమూలికలు, సహజసిద్ధ రంగులతో...
మనం నిత్యం తింటున్న పండ్లు , మొక్కలు, ఆహారంతో పాటు ప్రతి మొ క్కలోనూ ఆయుర్వేదం ఉంది. అయితే నేడు వినాయక చవితికి చేసే గణనాథుల ప్రతిమలను అన్ని రసాయనాలతో తయారుచేస్తున్నారు. ఇవి వినాయక నవరాత్రులలో దవళకాంతులమధ్య ఎంతో శోభాయమా నంగా ఉండవచ్చు. కానీ నిమజ్జనం చేసిన తరువాత వీటిలో వాడిన రసాయన పదార్థాలు భూమిపైన, నీటిపైనా ప్రభావం చూపి వాటిని కలు షితం చేస్తున్నాయి. మట్టి, వనమూలికలు, జాజికాయ, కరక్కాయ, మిరి యాలు, శొంటి, కొబ్బరి పీచు, వస కొమ్ములు , వట్టి వేళ్లు ఇంకా ఎన్నో వనమూలికలు తక్కువ ధరలో నేడు లభ్యమవుతున్నాయి.
వాటితో వినా యకుడిని తయారుచేసి సహజసిద్ధమయిన రంగులను అద్దితే వినాయ క నిమజ్జనం తరువాత ఈ వనమూలికలు నీటిలో కలసి వీటి సారం భూమిలో ఇంకి ఆ ప్రదేశం శుద్ధి చేయబడుతోంది. నీరు ఎప్పుడైతే స్వ చ్ఛంగా తయారవుతుందో రోగాలు చాలా వరకు తగ్గుతాయి. కనీసం ప్రతిఒక్కరు చిన్న మట్టి వినాయకుడిని అయినా మూలికలతో తయారు చేసి వినాయక నవరాత్రుల అనంతరం వారి ఇండ్లలో ఉన్న బావిలో నిమజ్జనం చేసినట్లయితే అందిరికి మంచి ఆరోగ్యకరమయిన తాగునీ రు లభ్యమవుతుంది.
నదీ జలాలకు మేలు...
‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను నదుల్లో నిమజ్జనం చేసినపుడు అవి జల వనరులకు హాని కలిగిస్తున్నాయి. వీటిల్లో ఉండే విష రసాయనాల కారణంగా నీటిలో ఉండే జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. నా వంతుగా పర్యావరణానికి మేలు చేయాలని గత నాలుగేళ్లుగా వన మూలికలతో చేసిన గణేశ విగ్రహాన్ని తయారు చేస్తున్నాను. దీనికి ఔషధ శివలింగ మహా గణపతి అని పేరు పెట్టి పూజిస్తున్నాను. బంకమట్టి, బూరగకాయలు, టెంకాయ పీసు, కొన్ని మూలికలతో కలిపి చేసిన ఈ విగ్రహాన్ని నీళ్ళలో నిమజ్జనం చేసినపుడు ఆ నీరు శుద్ది జరుగుతుంది’ అని స్కూటర్‌మెకానిక్ తిరుమలశెట్టి చంద్రశేఖర్ పేర్కొన్నారు.
- పీవి రాఘవాచార్యులు,
సబ్ ఎడిటర్,Surya
సబ్ ఎడిటర్,Surya
No comments:
Post a Comment