పర్యావరణ పరిరక్షణకు... ఎకో ఫ్రెండ్లీ గణనాథులు
హిందువులకు ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒక్కటి. పండుగ రోజున వినాయక ప్రతిమ లను ఇంట్లో ప్రతిష్ఠించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిం చడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తర్వాత గణనా థుడిని నిమజ్జనానికి తరలిస్తారు. ఇక వినాయకులను ముందుగా మట్టితోనే తయారుచేసేవారు. కానీ ఆధునికత పెరగడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో గణనాథుల ప్రతిమల ను తయారుచేసి వాటికి కెమికల్స్‌తో కూడిన రంగులద్దుతు న్నారు. దీంతో ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది.
వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పిఒపి)తో తయారుచేయడంతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. తక్కువ బరువుగా ఉండడంతో పాటు తక్కువ ధరలో లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో గణనాథులను తయారుచేస్తున్నారు.
పిఒపిలో రసాయనాలెన్నో...
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లో జిప్సమ్, సల్ఫర్, ఫాస్పరస్, మెగ్నీషియమ్ వంటి కెమికల్స్ ఉంటాయి. ఇక ప్రతిమలకు వేసే రంగులు మెర్క్యురీ, క్యాడ్మియమ్, ఆర్సెనిక్, లెడ్, కార్బన్ వంటి రసాయనాలు కలిగి ఉంటాయి. ఈ విగ్రహాలను అలంకరించేందుకు ప్లాస్టిక్, థర్మోకోల్ యాక్ససరీస్‌ను వాడతారు. ఇవి బయోడిగ్రేడెబుల్ మెటీరియల్సే కాకుండా ఇవన్నీ టాక్సిక్ పదార్థాలు. ఇక గతంలో వినాయక విగ్రహాలు చిన్నవిగా ఉండేవి. కానీ నేడు అంగరంగ వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకొని గణనాథుల ప్రతిమలను భారీగా రూపొందిస్తున్నారు. ఫలితంగా ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది.
- పిఒపితో తయారై వివిధ రసాయనాలతో కూడిన రంగులతో అలం కరించిన వినాయక విగ్రహాలను సముద్రపు నీటిలో లేదా చెరువు లు, సరస్సులలో నిమజ్జనం చేయడం మూలంగా వీటిలోని రసాయ నాలు నీటిలో కరిగిపోతాయి. పిఒపి మెల్లిగా కరుగుతుంది. ఈ మేరకు హానికలిగించే రసాయనాలను అది వెదజల్లుతుంది. ఎసిడి టీ పెరగడంతో పాటు రసాయనాల మూలంగా నీరు పూర్తిగా కలుషి తమవుతుంది. ఫలితంగా నీటిలోని మొక్కలు, నీటి జీవులు చనిపో తాయి. ముంబయిలో గణనాథుల నిమజ్జనం తర్వాత చేపలు చని పోయి ఒడ్డుకు చేరుకున్న దృశ్యాలు కనిపిస్తాయి.
- ప్లాస్టిక్, థర్మోకోల్ వేస్ట్, పాలిథిన్ బ్యాగ్స్ కరగకుండా నీటిలోనే ఉం డిపోతాయి. దీంతో నీటిలో జీవించే ప్రాణులకు వీటి మూలంగా సమస్యలు ఎదురవుతాయి. ఇవి భూమిలోకి చేరుకొని కాలుష్యానికి కారణమవుతాయి. ఫలితంగా స్థానికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర య్యే అవకాశాలుంటాయి.
- రసాయనాలతో కూడిన గణనాథులను నిమజ్జనం చేసిన నీటిని ఉప యోగించిన వారికి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు చర్మవ్యాధులు వస్తాయి. రక్తం, కంటి సంబంధిత వ్యాధులు కూడా సోకుతాయి.
పరిష్కారం...
వినాయక నిమజ్జనం సందర్భంగా పర్యావరణానికి కలిగే హానిని తగ్గించవచ్చు. ఇందుకోసం విగ్రహాల తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. - వినాయక విగ్రహాల తయారీకి పిఒపిని వాడకూడదు. సహజసిద్దమై న మట్టిని ప్రతిమల తయారీకి వినియోగించాలి. ప్రకృతి సిద్దమైన పదార్థాలను విగ్రహాల రూపకల్పనలో వినియోగించాలి. విగ్రహాలకు ఆర్గానిక్, వెజిటేబుల్ రంగులను ఉపయోగించాలి. గతంలో ఇటువంటి విగ్రహాలు పెద్దగా దొరికేవి కావు. కానీ నేడు పలు స్వచ్చంధ సంస్థలు మట్టితో తయారైన వినాయక ప్రతిమలను తయారుచేసి అతితక్కువ ధరలలో విక్రయిస్తున్నాయి.
- గణనాథుల విగ్రహాల అలంకరణకు థర్మోకోల్ ప్లాస్టిక్‌ను వినియో గించకూడదు. దీనికి బదులుగా వస్త్రం, కలప, పేపర్, ఇతర ప్రకృతి సిద్దమైన వస్తువులను వాడడం శ్రేయస్కరం.
- వినాయక విగ్రహాలను చెరువులు, సరస్సులలో నిమజ్జనం చేయ డానికి బదులు ప్రత్యేకంగా ఇంటి వద్ద ఏర్పాటుచేసిన నీటి టబ్, ట్యాంక్‌లో నిమజ్జనం చేయడం మంచిది.
- కొందరు మెటల్ లేదా రాతితో తయారైన వినాయక విగ్రహాన్ని పండుగ సందర్భంగా ప్రతిష్టించుకుంటారు. ఈ విగ్రహాలను నీటిలో ముంచి కొంత సేపటి తర్వాత బయటకు తీసి తిరిగి ఇంటికి తీసుకో వడం చేస్తుంటారు కొందరు. ఈ విధంగా చేయడం మంచిదే.
- వినాయక విగ్రహాలకు వేసిన పూల దండాలు, ఆర్గానిక్ మెటీరియ ల్స్‌ను తీసి గార్డెన్‌లలో మొక్కలకు ఎరువులుగా వినియోగించుకోవ చ్చు. నీటిలో వేయడం కంటే ఇది మంచి పద్దతి.
- వినాయక నిమజ్జనం సందర్భంగా పాటలు పాడడం, నృత్యాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ శబ్ద కాలుష్యం కాకుండా నియంత్రణలో పాటలు ఉండేలా చూసుకోవాలి.
ఎకో - ఫ్రెండ్లీ గణనాథుల తయారీలో యుగపథ్
దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి అనంతరం నిమజ్జనం చేయడం ఆనవారుుతీగా వస్తోంది. భారీ ఊరేగింపుతో వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తారు. ప్రతి ఏటా దేశంలో కోట్లాది వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. రసాయనాలతో కూడిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులతో ఈ విగ్రహాలను తయారుచేయడం మూలంగా నిమజ్జనం చేసిన చెరువులు, సరస్సులు, సముద్రాలు కలుషితమవుతున్నారుు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని పలు స్వచ్ఛంద సంస్థలు ఎకో-ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను తయారుచేయాలని పిలుపునిస్తున్నారుు. ఇటువంటి సంస్థల్లో ఒకటి మహారాష్ట్ర పూణె నగరానికి చెందిన యుగపథ్. ఈ సంస్థ గత రెండేళ్లుగా పూణె నగరంలో పర్యావరణానికి హాని కలగని గణనాథులను వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తోంది.
పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తున్న సంస్థ యుగపథ్. ఈ సంస్థను రెండు సంవత్సరాల క్రితం పర్యావరణ ప్రేమికులైన కొందరు యువకులు కలిసి ప్రారంభించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఎకో-ఫ్రెండ్లీ గణనాథుడు రూపుదిద్దుకునేలా వీరంతా కృషిచేస్తున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత నీటిని కలుషితం చేస్తున్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారు రెండు సంవత్సరాల క్రితం వినాయక నిమజ్జనానికి ముందు మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. రసాయనిక రంగులతో తయారైన విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడానికి బదులుగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ట్యాంకులలో నిమజ్జనం చేయాలని కోరారు. కాని వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గణేష్ చిత్రశాల సభ్యులు ఎకో-ఫ్రెండ్లీగా వినాయకులను తయారుచేసేందుకు వర్క్‌షాపులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
‘వినాయక చవితి నిమజ్జనం ఊరేగింపులో మునిగితేలిన వారెవరూ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు. పర్యావరణ పరిరక్షణకు విగ్రహాలను మేము ఏర్పాటుచేసిన ట్యాంకుల్లో నిమజ్జనం చేయాలని కోరినా ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో విగ్రహాల తయారీలో మార్పులు తీసుకురావడం మేలని భావించాము’ అని యుగపథ్ వ్యవస్థాపక సభ్యుడు సుహిల్ భట్టడ్ పేర్కొన్నారు. ఈ మేరకు గత ఏడాది వారు పూణెలో ఓ వర్క్‌షాపును నిర్వహించగా దాదాపు 100మంది వినాయక ప్రతిమలను తయారుచేసేవారు అందులో పాల్గొన్నారు. సాధారణ మట్టితో తయారయ్యే విగ్రహాలను తయారుచేయడం వల్ల కలిగే లాభాలను వారు విగ్రహాల తయారీదారులకు వివరించారు.
రసాయనాలతో కూడిన విగ్రహాల తయారీకి బదులుగా సహజసిద్దంగా లభించే రంగులతో విగ్రహాలను తయారుచేయాలని వారు కోరారు. ‘లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహారాష్టల్రో వినాయక ఉత్సవాలను ప్రారంభించినప్పుడు మట్టితో తయారైన విగ్రహాల తయారీకి కృషిచేశారు. చెరువుల ఒడ్డున కూర్చొని మట్టిని తెప్పించి ఆయన విగ్రహాలను తయారుచేయించేవారు. పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారైన గణనాథులే మేలని ఆయన అప్పుడే చెప్పారు. కానీ నేడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో విగ్రహాలను తయారుచేయడం మూలంగా నీరు కలుషితమవుతోంది.
పిఒపిలోని రసాయనాల మూలంగా నీటిలో జీవించే చేపలు వంటి ప్రాణులకు హానికలుగుతోంది’ అని యుగ్‌పథ్ సభ్యుడు సలీల్ రణాడె పేర్కొన్నారు. ఇక యుగపథ్ ఈ ఏడాది దాదాపు 500 మంది వినాయక విగ్రహాల తయారీదారులకు ఎకో-ఫ్రెండ్లీ విగ్రహాల తయారీలో శిక్షణనిచ్చింది. ఈ వర్క్‌షాపు ఈనెల 6న ప్రారంభమై శుక్రవారం ముగిసింది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు శిక్షణ కొనసాగింది. మట్టితో వినాయక విగ్రహాలను తయారుచేసి వాటికి ప్రకృతిసిద్దంగా లభించే రంగులను అద్దడం గురించి వివరించారు.
వినాయక ప్రతిమల తయారీకి కెమికల్స్‌తో కూడిన రంగులను వాడుతున్నారు. ఫలితంగా ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే కాలుష్యం వెలువడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రసాయనాల రంగులకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన రంగులను వాడితే పర్యావరణానికి మేలు జరుగుతుందని పర్యావరణ ప్రేమికులు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎకో-ఫ్రెండ్లీ గా ఉండే నేచురల్ డైస్ వాడాలని ప్రచారాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు గత వారం వినాయక విగ్రహాలను తయారుచేసే వారితో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కెమికల్స్‌తో కూడిన రంగులకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధ రంగుల వాడకాన్ని గురించి ఈ సందర్భంగా వివరించారు.
రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఎపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పిసిబి) ఎకో-ఫ్రెండ్లీ గణనాథులు రూపుదిద్దుకునేలా కృషిచేస్తోంది. రసాయనాలతో కూడిన రంగులతో తయారైన గణనాథులను హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం మూలంగా అందులోని నీరు కలుషితమవుతోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా హైదరాబాద్‌లోని విగ్రహాల తయారీదారులతో గత వారం సమావేశాన్ని ఏర్పాటుచేశారు బోర్డు అధికారులు. ఈ సమావేశంలో నేచురల్ డైస్ గురించి తెలియజేశారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్, నాగోల్, కూకట్‌పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 400మంది విగ్రహాల తయారీదారులు సమావేశంలో పాల్గొన్నారు. వారికి సింథటిక్ డైస్‌ను గణనాథుల తయారీకి వాడితే పర్యావరణానికి కలిగే హాని గురించి వివరించారు.
అధ్యయనం...
పిసిబి అధికారుల అధ్యయనం లో సింథటిక్ డైస్‌తో తయారైన గణనాథులను నీటిలో నిమజ్జ నం చేయడం మూలంగా నీరు పూర్తిగా కలుషితమవుతున్నట్టు తేలింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్ పెయింట్స్‌లో మెర్క్యురీ, క్యాడ్మియమ్, లెడ్ కెమికల్స్ ఉంటాయి. ఇవి నీటిలో జీవించే ప్రాణులకు హాని కలిగిస్తు న్నాయి.
హాని కలగని...
సహజసిద్ధంగా తయారైన రంగులను వాడటం మూలంగా నీటి కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. చెట్లు, పుష్పాలు, కూరగాయల నుంచి తయారయ్యే ఈ రంగులు వినాయకుడి వాడడం శ్రేష్టం. ఈ రంగులు సంప్రదాయబద్దంగా కూడా ఉంటాయి. ఇక ఎకో-ఫ్రెండ్లీ డైస్ ఎండిన పువ్వులు, ఆకులు, కొమ్మలు, విత్తనాల నుంచి ఎక్కువగా తయారుచేస్తున్నారు. వీటితో అందంగా, ఆకర్షణీయంగా ఉండే రంగులు రూపొందుతాయి. ఈ రంగులు నీటిలో సులభంగా కరిగిపోతాయి. రసాయనాలు అతి తక్కువగా ఉండడమే కాదు ఇవి నాన్ అలర్జిక్‌గా కూడా ఉంటాయి.
వివిధ రకాలుగా...
సహజసిద్ధ రంగులను పలు రకాలుగా తయారుచేస్తున్నారు. అడవిలోని పలు రకాల చెట్ల నుంచి వీటిని రూపొందిస్తున్నారు. రావిచెట్టు, జట్రోఫా, బల్సామ్, యూకలిప్టస్ చెట్ల నుంచి ఈ రంగులను తయారుచేస్తున్నారు. నిమ్మ, గోరింటాకు, టేకు చెట్ల నుంచి సైతం సహజసిద్ధ రంగులను రూపొందిస్తున్నారు. వీటి తయారీ గురించి పిసిబి అధికారులు గణనాథుల తయారీదారులకు వివరించారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా హైదరాబాద్‌లోని విగ్రహాల తయారీదారులతో గత వారం సమావేశాన్ని ఏర్పాటుచేశారు బోర్డు అధికారులు. ఈ సమావేశంలో నేచురల్ డైస్ గురించి తెలియజేశారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్, నాగోల్, కూకట్‌పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 400మంది విగ్రహాల తయారీదారులు సమావేశంలో పాల్గొన్నారు. వారికి సింథటిక్ డైస్‌ను గణనాథుల తయారీకి వాడితే పర్యావరణానికి కలిగే హాని గురించి వివరించారు.
అధ్యయనం...
పిసిబి అధికారుల అధ్యయనం లో సింథటిక్ డైస్‌తో తయారైన గణనాథులను నీటిలో నిమజ్జ నం చేయడం మూలంగా నీరు పూర్తిగా కలుషితమవుతున్నట్టు తేలింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్ పెయింట్స్‌లో మెర్క్యురీ, క్యాడ్మియమ్, లెడ్ కెమికల్స్ ఉంటాయి. ఇవి నీటిలో జీవించే ప్రాణులకు హాని కలిగిస్తు న్నాయి.
హాని కలగని...
సహజసిద్ధంగా తయారైన రంగులను వాడటం మూలంగా నీటి కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. చెట్లు, పుష్పాలు, కూరగాయల నుంచి తయారయ్యే ఈ రంగులు వినాయకుడి వాడడం శ్రేష్టం. ఈ రంగులు సంప్రదాయబద్దంగా కూడా ఉంటాయి. ఇక ఎకో-ఫ్రెండ్లీ డైస్ ఎండిన పువ్వులు, ఆకులు, కొమ్మలు, విత్తనాల నుంచి ఎక్కువగా తయారుచేస్తున్నారు. వీటితో అందంగా, ఆకర్షణీయంగా ఉండే రంగులు రూపొందుతాయి. ఈ రంగులు నీటిలో సులభంగా కరిగిపోతాయి. రసాయనాలు అతి తక్కువగా ఉండడమే కాదు ఇవి నాన్ అలర్జిక్‌గా కూడా ఉంటాయి.
వివిధ రకాలుగా...
సహజసిద్ధ రంగులను పలు రకాలుగా తయారుచేస్తున్నారు. అడవిలోని పలు రకాల చెట్ల నుంచి వీటిని రూపొందిస్తున్నారు. రావిచెట్టు, జట్రోఫా, బల్సామ్, యూకలిప్టస్ చెట్ల నుంచి ఈ రంగులను తయారుచేస్తున్నారు. నిమ్మ, గోరింటాకు, టేకు చెట్ల నుంచి సైతం సహజసిద్ధ రంగులను రూపొందిస్తున్నారు. వీటి తయారీ గురించి పిసిబి అధికారులు గణనాథుల తయారీదారులకు వివరించారు.
No comments:
Post a Comment